ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరుమాత్రమే ఉందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ మూడో స్థానంలోకి […]