రివ్యూ: ‘పురుషోత్తముడు’ చిత్రం

కాస్ట్ & క్రూ:
హీరో: రాజ్ తరుణ్
హీరోయిన్: హాసిని సుధీర్
సపోర్టింగ్ కాస్ట్: బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, విరాన్ ముత్తంశెట్టి
దర్శకుడు: రామ్ భీమా
నిర్మాతలు: ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్: పి జి విందా

టాలీవుడ్‌లో ప్రస్తుత హాట్ టాపిక్‌లో ఉన్న‌ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ: రచిత్ రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువుకుని హైదరాబాద్ కి వస్తాడు. అతని తండ్రి పరశురామయ్య ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి సీఈఓ చేయాల‌నుకుంటారు. కానీ కంపెనీ నియమాల ప్రకారం, భవిష్యత్ సీఈఓ 100 రోజులు వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి సాదాసీదా జీవితం గడపాలి. రచిత్ ఈ సవాల్‌ను స్వీకరించి సామాన్య జీవితం గడిపేందుకు బయల్దేరుతాడు. ఈ సమయంలో, అన్యాయానికి గురవుతున్న రైతులను ఆదుకోవడం, పూల తోటల అమ్ములు (హాసిని సుధీర్) తో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం వంటి అనేక సంఘటనలు జరుగుతాయి. చివరికి రచిత్ సీఈఓ స్థానాన్ని సాధించాడా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమాను థియేట‌ర్‌లో చూడాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ‌: రాజ్ తరుణ్ గ్లామర్ లుక్‌లో కనపడతాడు. అతని నటన మెచ్చుకోదగ్గది. హాసిని సుధీర్ అందంగా కనిపించి, ఆకట్టుకుంటుంది, కానీ నటనలో ఇంకాస్త మెరుగుపరచుకోవాలి. రమ్యకృష్ణ తన పాత్రలో ఎప్ప‌టిలాగే ప‌దును చూపించింది. విరాన్ ముత్తంశెట్టి తన పాత్రను బాగా నెరవేర్చాడు. మురళీ శర్మ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రవీణ్ కామెడీ న‌వ్విస్తుంది. ప్రకాష్ రాజ్, పాత్ర త‌క్కువ స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, సినిమాకు హైప్ ఇచ్చాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక ప్రతిభ: ఈ సినిమా సాంకేతికంగా నెక్ట్స్ లెవ‌ల్ అని చెప్పుకోవ‌చ్చు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, గోపీ సుందర్ సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. పాటలు వినసొంపుగా ఉన్నాయి, మాటలు బాగా రాసారు. నిర్మాతలు సినిమా నాణ్యతను ఎక్కడా తగ్గకుండా బడ్జెట్ ఖర్చు చేశారు. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా, గ్రాండ్‌గా అనిపిస్తుంది. 2 గంటల రన్ టైం కూడా ప్రేక్షకులకు బోర్ కాకుండా ఉంచుతుంది.

విశ్లేషణ: ‘పురుషోత్తముడు’ సినిమా సామాజిక బాధ్యత, వ్యక్తిగత విలువలను ప్రతిబింబిస్తుంది. రచిత్ రామ్ పాత్ర ద్వారా రైతుల సమస్యలను ఎత్తిచూపిస్తుంది. డైరెక్టర్ రామ్ భీమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, మంచి సామాజిక సందేశాన్ని కలిపి, అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించాడు. సినిమా వినోదం, ఆలోచనాత్మక కంటెంట్ కలిపిన మంచి సినిమా అనిపిస్తుంది.

ముగింపు: ‘పురుషోత్తముడు’ ఒక ఆకట్టుకునే సినిమా, ఇది వినోదం, సామాజిక వ్యాఖ్యానం రెండింటినీ అందిస్తుంది. కథా విషయంలో కొత్తదనం లేకపోయినా, సినిమా బలమైన నటన, సాంకేతిక ప్రతిభ, సమకాలీన సందేశం ఈ సినిమా విజ‌యం సాధించ‌డానికి కార‌ణ‌మవుతాయ‌ని చెప్పొచ్చు.

రేటింగ్: 3.25 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *